Ambanti: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అలాగే పరిశ్రమలను తీసుకురావాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అండ్ టీం కలిసి ఆదివారం దావోస్ వెళ్ళన సంగతి తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అండ్ టీం అక్కడి ఎన్నారైల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి భరత్ మాట్లాడుతూ అవునన్నా కాదన్న రాబోయే రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.
ఇలా భరత్ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారంటూ మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గోల చేశారు. అయితే గత వారం రోజులుగా ఏపీలో డిప్యూటీ సీఎం వార్ జరుగుతున్న నేపథ్యంలో భరత్ డావోస్ వెళ్లి మరి లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారని తెలుస్తుంది.
ఇలా కూటమి ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో వీటిని వైసీపీ అస్త్రంగా చేసుకుందని చెప్పాలి. ఈ క్రమంలోనే వైకాపా ఫైర్ బ్రాండ్ అంబంటి రాంబాబు వెంటనే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దావోస్ పర్యటనలో భాగంగా భరత్ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ మాట్లాడిన చిన్న వీడియో క్లిప్ ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక ఈ వీడియోని షేర్ చేసిన అంబంటి రాంబాబు దావోస్ వెళ్లి ఏమి సాధిస్తారో కానీ.. లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు అంటూ సెటైర్లు వేస్తూ పోస్ట్ చేశారు దీంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఇదే విషయంపై జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమిలో ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తే ఇది వైసీపీకి అదునుగా మారుతుందని మనమే వారికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది ప్రత్యర్థులకు అస్త్రాలను ఇస్తున్నామని చెప్పుకనే చెప్పారు. కిరణ్ మాటలను అంబటి అక్షరాలా నిజం చేశారనే తెలుస్తోంది.