మూడు రాజధానులు వద్దు..ఒక రాజధాని ముద్దు..పరిపాలన వికేంద్రీకరణ మాకొద్దు..ఆ జిల్లాల అభివృద్ధి ఎలా ఉంటే? మాకేంటి పని! అన్ని రాజధానులు ఒకే చోటైన అమరావతిలోనే కొలువు దీరాలన్నది మాధ్యేయం అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో ఎంతలా యాగీ చేస్తున్నారో తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో కూడా అక్కడ అడపా దడపా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే వీటిని ఎంత మాత్రం లెక్క చేయకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి యంత్రాంగం శర వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో భాగంగా కర్నూలులో హైకోర్టు , పరిపాలనా రాజధానికి వైజాగ్, అమరావతి మరో రాజధానిగా అవతరించబోతున్నాయి.
ఇక జగన్ ఏడాది పాలనపై ప్రజల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే మద్యాన్ని సైతం ధపధపాలుగా బ్యాన్ చేస్తూ యంత్రాంగం ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవసరం మేరకు ప్రభుత్వ భూముల్ని అమ్మడం జరుగుతోంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు, పథకాల కోసం అవసరమైన నిధుల్ని సమీకరించుకునే పనిలో పడిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టీటీడీ ఆస్తుల విషయంలో కూడా వేలు పెట్టే ప్రయత్నం చేసింది. కానీ వెంకన్న స్వామి ఆస్తుల జోలికి వెళ్తే ఊరుకోబోమని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే సరికి వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో మరో గత్యంతరం లేక ఇప్పుడు అమరావతిలోని 1600 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలని నిర్ణయించారు.
అలా విక్రయించడం ద్వారా వచ్చిన నిధులతో `మిషన్ బిల్డ్ ఏపీ` కి బదలాయిస్తారని సమాచారం. ఇక గత ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్దిలో భాగంగా రకరకాల దేశాల పేర్లు చెప్పి..డబ్బందా వృద్ధా చేసి చివరికి సింగపూర్ కి చెందిన కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. ఐదేళ్ల పాలనలో అమరావతి ఎంతగా అభివృద్ధి చెందిన్నదే కళ్లారా చూస్తున్నదే. ఇక మూడురాజధా నుల బిల్లుతో పాటు జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన సీఆర్డీఏ రద్దు బిల్లును రద్దు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.