నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు సంచలనంగా మారాయి. చింతారెడ్డిపాలెం లోని నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 3 ప్రత్యేక వాహనాల్లో నారాయణ ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారులు… ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా… బయట్నుంచి ఎవరూ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతకముందు నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నోటీసుల్లో నారాయణను ఏ-2గా పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్ల కింద నారాయణపై కూడా కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐడీ అధికారులు హెచ్చరించారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్ 41ఏ(3)(4) కింద నారాయణను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు.