Amala Paul: అమలాపాల్ తెలుగు ,తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అనేక చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. లవ్ ఫెయిల్యూర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి పలు సినిమాలలో నటించింది. ఎప్పుడు ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ తరచు వివాదాలలో నిలుస్తూ ఉంటుంది.మనసులోని భావాలను ముక్కు సూటిగా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ నిత్యం సినిమాలతో పాటు కాంట్రవర్సీలతో సావాసం చేస్తూ ఉంటుంది. వెండితెర మీద మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా ఈ అమ్మడు తన సత్తా చాటుతోంది.
అమలాపాల్ ఎన్నో వెబ్ సీరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమలాపాల్ తాజాగా ఆహాలో విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్లో తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఎప్పుడు ఏదో ఒక రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఈ అమ్మడు తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఎటువంటి వివాదాలు లేకుండా తన రెమ్యూనరేషన్ విషయంలో వార్తల్లో నిలిచింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండే అమలా పాల్ తన రెమ్యూనరేషన్ పెంచేసింది.
ఈ తరుణంలో అమలాపాల్ నాగార్జున సరసన నటించే అవకాశం పోగొట్టుకుందని సమాచారం. నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు మొదట కాజల్ నీ అనుకున్నారు. కానీ కాజల్ ప్రెగ్నెన్సీ వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవడంతో కాజల్ స్థానంలో అమలాపాల్ అయితే ఆ క్యారెక్టర్ కు సరిపోతుందని భావించి సినిమా యూనిట్ అమలాపాల్ ని సంప్రదించారు. కానీ అమలా పాల్ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేయడంతో అంతా రెమ్యునరేషన్ ఇవ్వటం తమ వల్ల కాదనీ నిర్మాతలు చేతులెత్తేశారు. రెమ్యూనరేషన్ భారీగా పెంచడం వల్ల అమలాపాల్ నాగార్జునతో కలిసి నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది.