అల్లు హీరో ని వాడుకొని వదిలేసిన హీరోయిన్!

టైటిల్ చూసి అల్లు అర్జున్ ని కానీ, వాళ్ళ తమ్ముడి ని కానీ హీరోయిన్ మోసం చేసిందని అనుకోవద్దు. ఇది అల్లు శిరీష కొత్త సినిమాలో ఒక సీన్. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ కొత్త సినిమాతో వస్తున్నాడు.

మొదట్లో వేరే టైటిల్ తో రెడీ అయిన ఈ సినిమా టైటిల్ ఇప్పుడు ‘ఊర్వశివో.. రాక్షసివో’ గా మార్చారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యూయేల్ హీరో హీరోయిన్లుగా రాకేష్ శశి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఇది.

ఇన్నాళ్లు లవ్ స్టోరీస్, ఫామిలీ డ్రామా ల తో అలరించిన అల్లు శిరీష్ ఈ సారి ఒక రొమాంటిక్ అండ్ బోల్డ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఓ వర్షం కురిసిన రాత్రి హీరో, హీరోయిన్  శృంగారంతో రెచ్చిపోయే వరకూ సాగుతుంది.

దాని తర్వాత  శృంగారం వరకేనని.. ఇది ప్రేమ, పెళ్లికి ఛాన్స్  లేదని హీరో అల్లు శిరీష్ కు హీరోయిన్ షాక్ ఇస్తుంది. గీత ఆర్ట్స్ అంటే ఇప్పటివరకు చాలా మంచి సినిమాలు తీశారు, కానీ అల్లు అరవింద్ ఇలాంటి బోల్డ్ కథను ఎలా నిర్మించాడో అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఈ ట్రైలర్ నే ఫ్యామిలీతో చూడలేకుండా ఉంది. ఇక థియేటర్లో చూడడం కష్టం. ఈ సినిమా నవంబర్ 4  న థియేటర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.