ఆ హీరోయిన్ తో ఎఫైర్ పై స్పందించిన అల్లు శిరీష్

మెగా ఫామిలీ నుండి వచ్చిన హీరోలు దాదాపు అందరు సక్సెస్ అయ్యారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఇప్పటికే ఒక్క సరైన హిట్ కూడా ఇవ్వలేదు. ‘శ్రీరస్తు, శుభమస్తు’ మూవీ కి  మంచి టాక్ వచ్చినా, భారీ విజయం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత వచ్చిన ABCD మూవీ ప్లాప్ అవ్వడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ ఇప్పుడు ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ మూవీ ‘ప్యాప్ ప్రేమ కాదల్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ చిత్రంలో, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ టైం లో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ తో ప్రేమలో పడ్డాడని, ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా స్పందించిన శిరీష్ ఆ రూమర్స్ ను కొట్టి పడేశాడు. సినీ తారలపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవడం సహజమేనని చెప్పిన శిరీష్, గతంలో ఇలాంటి రూమర్స్ తనపై చాలానే వచ్చాయన్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ కి, తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, ప్రస్తుతం తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు.