‘గని’లా మారిపోయిన అల్లు అయాన్.!

అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ నుంచి అడపా దడపా ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తుంటాయి. పుత్రోత్సాహంలో ఉప్పొంగిపోతూ అల్లు అర్జున్, తన కుమారుడు అల్లు అయాన్ స్పెషల్ వీడియోస్‌ని వదులుతుంటాడు సోషల్ మీడియాలో.

అలా, తాజాగా అల్లు అయాన్ ‘గని’ వీడియో బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గని’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం విదితమే. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ వచ్చింది. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది కూడా.

అదే పాట కోసం అల్లు అయాన్ తనదైన స్టయిల్లో ఇంట్రెస్టింగ్‌గా యాక్టింగ్ చేసేశాడు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ, గ్లోవ్స్ ధరించి బాక్సింగ్ చేస్తూ.. అల్లు అయాన్ కనిపించేసరికి అభిమానులు బోల్డంత సంబరపడిపోతున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అల్లు అయాన్ కళ్ళల్లో ఏదో స్పార్క్ వుంది.. ఖచ్చితంగా మంచి నటుడయ్యే అవకాశాలున్నాయ్.