అలీ పై ఫైర్ అయిన అల్లు అరవింద్

అల్లు రామలింగయ్య కొడుకు గా అల్లు అరవింద్, తన తండ్రి పేరుని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాడు. పొదుపుగా సినిమా నిర్మించడంలో దిట్టైన అల్లు అరవింద్… సబ్జక్ట్స్ సెలక్షన్ లో కూడా నిష్ణాతుడు. అంత టాలెంట్ ఉంది కాబట్టే తండ్రి స్థాపించిన బ్యానర్ ని టాప్ లెవల్ కి తేగలిగాడు. అలాగే చిరంజీవి కెరీర్ లో అల్లు అరవింద్ ది కీ రోల్ అని చాలా మంది అంటుంటారు.

ఫ్యూచర్ అంతా ఓటీటీల హవానే అని గమనించిన అల్లు అరవింద్ ఓటీటీ సంస్థ ఆహాను స్టార్ట్ చేశాడు. ఈ మధ్య అలీ టాక్ షో కి అల్లు అరవింద్ గెస్ట్ గా వచ్చాడు. సరదాగా సాగిపోతున్న టాక్ షో లో సడన్ గా అల్లు అరవింద్ అలీ పై ఫైర్ అయ్యాడు.

టాక్ షో లో తన మనవడు, మనవరాలు గురించి ఆయన మాట్లాడారు. అయాన్ కంటే అర్హ చాలా తెలివైన అమ్మాయి అని పొగిడాడు. దాని తర్వాత అలీ అడిగిన ఒక ప్రశ్నకు అల్లు అరవింద్ కోప్పడ్డాడు. అల్లు-చిరంజీవి కుటుంబాల మధ్య డిస్ట్రబెన్స్ లు ఉన్నాయని పుకారు, దీనికి మీ సమాధానం ఏమిటీ? అని అలీ అడిగాడు.

ఆ ప్రశ్న అల్లు అరవింద్ కి కోపం వచ్చింది. నీ షోలో కాంట్రవర్సీ ప్రశ్నలు ఉండవు అంటేనే నేను వచ్చాను. కాంట్రవర్సీ ఉండదు సర్ప్రైజ్లు ఉంటాయన్నారు. అవి ఇవేనా అంటూ ఒకింత అలీపై మండి పడ్డాడు. అలీతో సరదాగా ప్రోమోలో ఈ ఇది చూడొచ్చు. తర్వాత ఏం జరిగింది అనేది పూర్తి షో టెలికాస్ట్ అయితే  కానీ తెలియదు.