96 కథలను రిజెక్ట్ చేసి ఆ సినిమాను ఓకే చేసిన అల్లు అర్జున్.. ఏం జరిగిందంటే?

ప్రతి స్టార్ హీరో సినీ కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. సంవత్సరాలు గడిచినా ఆ సినిమాలు ప్రేక్షకులను వెంటాడటంతో పాటు ఆయా స్టార్ హీరోల కెరీర్ లో స్పెషల్ సినిమాలుగా నిలుస్తాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే గంగోత్రి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఆర్య సినిమాతో బన్నీకి కమర్షియల్ గా సక్సెస్ దక్కింది.

గంగోత్రి తర్వాత 96 కథలు విని రిజెక్ట్ చేసిన బన్నీ సుకుమార్ చెప్పిన ఆర్య సినిమా కథలో నటించడానికి మాత్రం వెంటనే ఓకే చెప్పారు. దిల్ షూట్ సమయంలో వినాయక్ దగ్గర పని చేసిన సుకుమార్ చెప్పిన ఆర్య కథ దిల్ రాజుకు ఎంతగానో నచ్చింది. దిల్ సినిమా సక్సెస్ సాధిస్తే సుకుమార్ కు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని దిల్ రాజు మాటిచ్చారు. ఆర్య సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాదని భావించిన దిల్ రాజు ఆ తర్వాత అంగీకరించారు.

గంగోత్రితో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆర్య సినిమాకు పర్ఫెక్ట్ అని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. రొటీన్ కథలు వద్దని అనుకున్న బన్నీ ఆర్య సినిమా కథలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ ఈ సినిమా కథలో మార్పులు చెప్పగా ఆ మార్పులు చేయడానికి సుకుమార్ అంగీకరించారు. చిరంజీవికి కూడా ఆర్య సినిమా కథ ఎంతగానో నచ్చింది. సుకుమార్ తనకు అవసరమైన టెక్నీషియన్లను తీసుకున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ తక్కువ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్యూన్లను సిద్ధం చేశారు. 120 రోజుల పాటు ఈ సినిమా షూట్ జరిగింది. నెగిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే బన్నీకి స్టైలిష్ స్టార్ ఇమేజ్ దక్కింది. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది.