Prabhas – Allu Arjun: ప్రభాస్ ను ట్రోల్ చేస్తున్న బన్నీ ఫాన్స్… కారణం అదేనా?

Prabhas – Allu Arjun: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా రాధే శ్యామ్. ప్రభాస్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం అయన అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సరసన పూజహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ ఒక ఫేమస్ జోతిష్యుడుగా పూజా హెగ్డే మధ్య సాగే ప్రేమ కథ అద్భుతంగా తీశారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ నే కాదు సగటు సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

కాగా, రాధే శ్యామ్ ప్రమోషన్లను నిన్నటి నుండీ మొదలుపెట్టారు.ముంబైలో రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించారు. ఆ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనంతరం ‘రాధే శ్యామ్’ టీం బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ప్రభాస్ మీడియాతో సరదాగా మాట్లాడాడు. తన పెళ్లి గురించి,రాజమౌళి తో తన సినిమా గురించి తన మీద తనే ఫన్నీ సెటైర్లు వేసుకుంటూ అందర్నీ నవ్వించాడు.

ఈ మీడియా సమావేశంలో బాహుబలి తర్వాత కే జి ఎఫ్ పుష్ప ఇలాంటి సినిమాలు హిందీలో బాగా సక్సెస్ అయ్యాయి దాని మీద మీ స్పందన ఏంటి అని ఒక విలేకరి అడిగాడు, దీనికి సమాధానంగా ప్రభాస్ చాలా ఆనందంగా ఉంది అని, వచ్చే రెండు, మూడేళ్ళలో 50కి పైగా సౌత్ సినిమాలు హిందీలో రిలీజ్ అవుతాయి.. అవి కూడా హిట్ అయ్యి సౌత్ రేంజ్ అలాగే ఇండియన్ సినిమా రేంజ్ పెరగాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యారు. అక్కడ పుష్ప సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు అల్లుఅర్జున్ గురించి నాలుగు మాటలు చెప్పలేదని బన్నీ ఫాన్స్ ఫీలయ్యారు. ఇక్కడ పుష్ప సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి, అల్లుఅర్జున్ గురించి నాలుగు మాటలు చెప్పి ఉండొచ్చు కదా, ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ ఎక్కించే సావు, అల్లు అర్జున్ ఫ్రెండ్ అయ్యుండి కూడా నీకు ఇంత ఇన్ సెక్యూరిటీ? ఎందుకు అని బన్నీ ఫాన్స్ ప్రభాస్ పై విరుచుకుపడుతున్నారు.