Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతో తెలుగుతో పాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాలో పుష్ప రాజ్ క్యారెక్టర్ లో నటించి తెలుగు ఇండస్ట్రీతో పాటు మిగిలిన ఇండస్ట్రీలో పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు.
ఈ సినిమా విడుదల అయి నెల రోజులు దాటినా కూడా ఈ పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమాలోని పాటలు డైలాగ్ లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబట్టింది. ఇక బన్నీ నటించిన సినిమాలు గతంలో మలయాళం హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయి టాక్ ను అందుకున్నాయి. పుష్ప సినిమాతో అది కాస్త రెట్టింపు అయ్యింది. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాను త్వరలోనే బాలీవుడ్ రీమేక్ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది విషయం తెలిసిందే. 2017 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను హరీష్ శంకర్, దిల్ రాజు కలిసి హిందీ రీమేక్ ను చేస్తున్నారట. ఈ మేరకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమాలో పలు మార్పులు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
