స్టార్ హీరోల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మామూలే. అయితే వారు చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం అనేదే విశేషం. ఇప్పటికే అనేకమంది స్టార్లు తమ పిల్లలను చిన్న వయసులో ఉండగానే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేయించారు. ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నాడు అల్లు అర్జున్. తన కుమార్తె అల్లు అర్హను టాలీవుడ్లోకి ప్రవేశపెడుతున్నారు. నిజానికి మహేష్ బాబు కుమార్తె సితార సినిమాల్లోకి వస్తుందని అంతా అనుకున్నారు. సితారను ఈమధ్య కాలంలో విపరీతంగా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్లు చూసి ఇదంతా ఆమె ఎంట్రీ కోసం చేస్తున్న ప్లాన్ అనే అనుకున్నారు. మహేష్, నమ్రతల మనసులో ఆ ఆలోచన ఉండి ఉండవచ్చు కూడ.
అయితే వారికంటే ముందే అర్హను దింపేస్తున్నారు. గుణశేఖర్ ప్రస్తుతం ‘శాకుంతలం’ చేస్తున్నారు. ఇందులో సమంత లీడ్ రోల్ చేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇందులో భరతుడి చిన్ననాటి రోల్ ఉందట. దాని కోసం అల్లు అర్హను ఎంచుకున్నారట ఆయన. కథ, పాత్రలు బాగుండటంతో అర్హను ఆ సినిమాలో నటింపజేయడానికి డిసైడ్ అయ్యాడట అల్లు అర్జున్. గుణశేఖర్ గతంలో ఎన్టీఆర్ ను బాలనటుడిగా బాలరామాయణం ద్వారా వెండి తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సో.. మొత్తానికి సితార సినిమాల్లోకి రావడానికంటే ముందే అల్లు అర్హ ఎంట్రీ ఇచ్చేస్తోంది.