Allu Arha: రెండో సినిమా ప్రకటించిన అల్లు అర్హ… హీరో ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?

Allu Arha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు. అల్లు కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ ఇదివరకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా అల్లు నాలుగో తరం అయిన అర్హ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో నటించి సందడి చేశారు. ఈ సినిమాలో తన నటన ద్వారా అర్హ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం తన కుమార్తె తదుపరి సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట అయితే తాజాగా అర్హ రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇక అల్లు అర్హ తన రెండో సినిమా ఏ హీరో సినిమాలో నటిస్తుందో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వడం కాయం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకున్నారని తెలుస్తోంది.. మరి ఆ హీరో ఎవరు అంటే ఆయన మరెవరో కాదు అర్హ తండ్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో అర్హ ఒక కీలక పాత్రలో నటించబోతుందని సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.