Renu Desai: అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా.. రేణు దేశాయ్ స్పందన ఇదే!

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి మనందరికీ తెలిసిందే. రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినప్పటికీ తనకు తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన ఫాలోవర్స్‌ని కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. ఇటీవలే మూగ జీవాల కోసం తన కూతురు ఆద్య పేరు మీదగా ఒక ఎన్‌జీవోను కూడా స్థాపించింది రేణూ దేశాయ్. అలాగే సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

ఇకపోతే రేణు దేశాయ్ పిల్లలు అకిరా నందన్,ఆద్య ల గురించి మనందరికీ తెలిసిందే. తరచూ వీరికి సంబంధించిన చాలా విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రేణు దేశాయ్. అందులో భాగంగానే ఇప్పటికే గతంలో చాలా సార్లు తన కొడుకు అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంది. మొదట ఇంద్ర కీలాద్రి అమ్మారిని దర్శించుకున్న ఆమె సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి కూడా హాజరయ్యింది.

ఈ సందర్భంగా రేణూ దేశాయ్ కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడు అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నాడు అని రేణూను అడిగారు. దీనికి స్పందించిన ఆమె.. ఈ సమయం కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒక తల్లిగా మీ అందరికంటే నాకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అతను ఎప్పుడు ఓకే అంటే అప్పుడే. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలి. అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. అయితే రేణు దేశాయ్ మాటలను బట్టి చూస్తే త్వరలోనే అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.