Allu Aravind: ఆయనతో 1000 కోట్ల సినిమా చేయాలని ఉంది… సాహసం చేయబోతున్న అల్లు అరవింద్?

Allu Aravind: అల్లు అరవింద్ తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సాయి పల్లవి నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమము ముంబైలో జరిగింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలలో భాగంగా ఆ భాష హీరోలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ట్రైలర్ లాంచ్ చేయగా హీరో కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక హిందీలో ట్రైలర్ లాంచ్ విడుదలవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు… గతంలో అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో గజినీ సినిమాని తెరకెక్కించి అప్పట్లోనే 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ఈ సినిమా సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ద్వారా నిర్మాతగా అల్లు అరవింద్ కూడా భారీ లాభాలను అందుకున్నారు. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న అల్లు అరవింద్ పలు విషయాలు తెలిపారు.

గజిని సినిమా షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా 100 కోట్లు రాబడుతుంది అంటూ తెలియజేశారు. అందుకే మేం ప్రమోట్ చేశాం. అప్పుడు రూ.100 కోట్లు ఎక్కువ.. ఇప్పుడైతే రూ.1000 కోట్లు రాబట్టే సినిమా తీయాలని ఉంది. అది గజిని-2 కూడా కావచ్చు అంటూ ఈయన మాట్లాడటంతో త్వరలోనే గజిని సీక్వెల్ సినిమా వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే గజినీ 2 కోసం ఈయన భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ సినిమా చేయాలి అనుకుంటే కాస్త సాహసమే అని చెప్పాలి.