Sai pallavi: సినీనటి సాయి పల్లవి త్వరలోనే తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అల్లు అరవింద్ నిర్మాణంలో నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల చెన్నైలో తమిళనాడు ట్రైలర్ లాంచ్ అయ్యింది.
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ కోలీవుడ్ హీరో కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ముందుగా మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాని చెప్పేటప్పుడు ఒక రియల్ స్టోరీగా చెప్పారు కానీ చేసేటప్పుడు రియల్ స్టోరీను ఒక అందమైన ప్రేమ కథగా మీ ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు.
ఈ సినిమాలో చైతన్య ఎంతో అద్భుతంగా నటించారని ఆయన పాత్రకు వంద శాతం న్యాయం చేశారని తెలిపారు. ఇక అల్లు అరవింద్ గారు ఈ సినిమా షూటింగ్ రోజులలో నాకు ఎలాంటి చిన్న సమస్య కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారని తను నాకు ఒక తండ్రితో సమానమని తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అల్లు అరవింద సాయి పల్లవి గురించి మాట్లాడుతూ నాకు కూతురు లేరు. కూతురే కనుక ఉంటే సాయి పల్లవి లాగా ఉండాలని కోరుకుంటాను ఆమె నా కూతురుతో సమానం అంటూ మాట్లాడారు.
ఇలా వీరిద్దరూ మా నాన్న లాంటి వ్యక్తి అని ఒకరు మా కూతురు లాంటి వ్యక్తి అని అల్లు అరవింద్ మాట్లాడటంతో బన్నీ ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఇంత మంచి టాలెంటెడ్ హీరోయిన్ ని పట్టుకొని అల్లు అరవింద్ కూతురు అనేసారు ఆమె కూడా అల్లు అరవింద్ ని తండ్రిని చేసేసారు. ఇక జన్మలో సాయి పల్లవి అల్లు అర్జున్ సరసన నటించలేదేమో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.