Allu Aravind: ఫేక్ ఐడితో హీరోయిన్లను ఫాలో అవుతున్న నిర్మాత.. ఇదేం అలవాటు రా సామి?

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ తాజాగా ఒక సంచలనమైన విషయాన్ని బయట పెట్టారు.. ఇటీవల ఈయన మిత్రమండలి అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నిహారిక ఎన్ ఎమ్ నటిస్తున్నారు ఇక ఈమెను ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు బన్నీ వాసు ఒక నాలుగు ఐదు మంది హీరోయిన్ల ఫోటోలను నా దగ్గరకు తీసుకువచ్చారు అయితే నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి అని చెప్పడంతో ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా అంటూ నన్ను అడిగారు. అప్పుడు నేను ఆ అమ్మాయిని ఇంస్టాగ్రామ్ లో ఫేక్ ఐడితో ఫాలో అవుతున్నాను అంటూ తనతో చెప్పానని అల్లు అర్జున్ వెల్లడించారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో ఈమెను ఫేక్ ఐడి తో ఫాలో అవుతున్నానని ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారని అల్లు అరవింద్ తెలిపారు.

తాను కేవలం ఈ అమ్మాయిని మాత్రమే కాదని, నా ఫేక్ ఐడి ద్వారా చాలామంది హీరోయిన్ల ఇతర సెలబ్రిటీలను కూడా ఫాలో అవుతూ ఉంటానని తెలియజేశారు ఒరిజినల్ అకౌంట్ తో ఫాలో అయితే బూతు కామెంట్లు చేస్తారు ఆ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అందుకే తాను ఒక ఫేక్ ఐడి ద్వారా ఇలా ఇండస్ట్రీలో అందరినీ ఫాలో అవుతూ అందరి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాను అంటూ అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే సెలబ్రిటీలు వారి ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఇలా ఫేక్ అకౌంట్ లను ఉపయోగిస్తూ సెలబ్రిటీల అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని అల్లు అరవింద్ బయట పెట్టడంతో పెద్ద ఎత్తున ఈయనపై నెటిజన్స్ విభిన్న రీతిలో కామెంట్లు చేయడమే కాకుండా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.