క్యాన్సర్ తో నరకం చూసిన నేను ఆమె వల్లే ఇలా ఉన్న ఉన్నాను: అల్లరి సుభాషణి

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అల్లరి సుభాషిని గురించి తెలియని వారంటూ ఉండరు. చింతామణి నాటకం ద్వారా బాగా పాపులర్ అయిన సుభాషిని గారు రవి బాబు నిర్మించిన అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు రావడంతో అప్పటినుండి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ నటించిన ఈమె ఇండస్ట్రీలో తనకంటు ఒక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుభాషిణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ..వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడ్డాను. ఆ సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాగిణి గారికి విషయం చెప్పడంతో బాలకృష్ణ గారిని కలిసి బసవతారకం హాస్పిటల్ కి వెళ్ళమని సిఫార్సు చేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చలపతి రావు గారు కూడా నా గురించి బసవతారకం డాక్టర్లకి సిఫార్సు చేయించాడు. అంతేకాకుండా నాటక రంగంలో తెలిసిన వ్యక్తి ప్రభుత్వం ద్వారా చికిత్స చేయించుకునే మార్గం చెప్పగా పదిహేను లక్షల దాకా ఖర్చు వస్తుందనుకుంటే ఐదు వేల రూపాయల ఖర్చుతో నా క్యాన్సర్ చికిత్స పూర్తయింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఖరీదైన మందులు వాడవలసి వచ్చింది. ఆ సమయంలో యాంకర్ సుమకి నా పరిస్థితి చెబితే అమెరికన్ సంస్థ ద్వారా ప్రతి ఆరు నెలలకి ఒకసారి మందులు పంపించేలా సహాయం చేసింది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్లీ అవకాశాల కోసం చిరంజీవి గారిని అడిగితే ముందు మీరు కోలుకొని ఆరోగ్యంగా ఉండండి. అవకాశాలు నేను మీకు ఇప్పిస్తాని చిరంజీవి గారు చెప్పారు అంటూ సుభాషిని చెప్పుకొచ్చింది. నాకు కష్ట సమయం వచ్చినప్పుడు ఇండస్ట్రీ నన్ను వదిలి పెట్టలేదు..అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.