Alcohol Teaser: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి మనందరికి తెలిసిందే. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అల్లరి నరేష్. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికి ఆ మూవీస్ ఏవి కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నరేష్ ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..
హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఆల్కహాల్. మెహర్ తేజ్ దర్శకత్వం వహించారు. అల్లరి నరేశ్ కెరీర్‌లో 63వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో రుహాని శర్మ హీరోయిన్ గా నటించింది. గిబ్రాన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో వైరల్ గా మారింది. లక్షలు లక్షలు సంపాదిస్తావు కానీ మందు తాగవు.. ఇంకా ఎందుకు నీ బతుకు అంటూ సత్య చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత “తాగుడికి సంపాదనకు లింకే ముంది.

తాగితే ఆల్కహాల్ నన్ను కంట్రోల్ చేస్తుంది. అది నాకు నచ్చదు” అంటూ నరేశ్ చెప్పే డైలాగ్ లు కూడా బాగున్నాయి. మొత్తంగా చూస్తే టీజర్ అదిరిపోయిందని చెప్పాలి. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం కామెడీ ప్రధానంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. అలాగే మరోసారి అల్లరి నరేష్ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ ఈ మూవీ నరేష్ కి ఏ మేరకు గుర్తింపును తెచ్చిపెడుతుందో చూడాలి మరి.
