Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వస్తువులను మనం దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటామని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎవరికి తోచిన విధంగా వారు పలు రకాల వస్తువులను దానం చేస్తూ శుభ ఫలితాలను అందుకుంటారు.ముఖ్యంగా వేసవి కాలంలో కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి వేసవికాలంలో ఎలాంటి వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయనే విషయానికి వస్తే….
వేసవి కాలం మొదలవడంతో ప్రతి ఒక్కరు ఎంతో దాహంతో తల్లడిల్లిపోతుంటారు. ఈ క్రమంలోనే అన్నదానం కన్నా, వేసవిలో నీటి దానం చేయడం వల్ల మంచి పుణ్య ఫలం కలుగుతుంది. అందుకే చాలామంది వేసవికాలంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా నీటిని దానం చేసేటప్పుడు ఒక కుండను మీ పూర్వీకుల పేరుపై, మరో కుండను విష్ణు భగవానుడు పేరు పై దానం చేయటం వల్ల అంతా శుభం కలుగుతుంది.
వీటితోపాటు వేసవి కాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను దానం చేయడం కూడా ఎంతో మంచిదని శాస్త్రం చెబుతోంది.ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటారో అలాంటి వారు వేసవికాలంలో మామిడి పండ్లను దానం చేయడం వల్ల సూర్యుడు అనుగ్రహం కలుగుతుంది. మామిడి పండుతో పాటు బెల్లం దానం చేయడం వల్ల సూర్యుడి స్థానం బలపడుతుంది. ఒక వ్యక్తి తనలో తాను ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా బెల్లం దానం చేయటం వల్ల సమాజంలో గౌరవం పొందడమే కాకుండా ఆ వ్యక్తి అభివృద్ధిలోకి వస్తాడని శాస్త్రం చెబుతోంది.