Prakash Raj: పెద్దలందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవాలి.. అప్పుడే సమస్య పరిష్కారం: ప్రకాష్ రాజ్

Prakash Raj: ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో సమస్యల్ని పరిష్కరించాలంటే ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అనేది ఒక నియంత పాలన కిందకు వస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. అలా చేస్తే మిగతా ఎన్నుకున్న వాళ్లకు ఐడెంటిటీ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 26మంది ఉన్నారంటే ఒక వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవడం కాదు. వారందరి నుంచీ కూడా భిన్నరకమైన ఆలోచనలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆ లీడర్ అనేవాడు అందర్నీ కలుపుకొని పోవాలని, ఏదైనా సమస్య వచ్చినపుడు అందరూ కలిసి మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించాలని ఆయన చెప్పారు.

అందరూ కలిసి ఒక వ్యక్తిని లీడర్‌గా ఎన్నుకుంటే వారు మాత్రమే పనిచేయడం కాదు.. ఇంకెవరెవరితో పని చేయించుకోవచ్చు, ఎవరి దగ్గర ఆ శక్తులున్నాయని ఆలోచించాలని ఆయన చెప్పారు. అందరికీ అవకాశం కల్పించాలి, సమానత్వం కనిపించాలని ప్రకాష్ రాజ్ అన్నారు.

ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రెసిడెంట్ హోదా, ఆ పీఠం దక్కించుకోవాలి. అది మాత్రమే తాదని, బేసిగ్గా చెప్పాలంటే వాళ్లు ఆలోచించే విధానమే తప్పుగా ఉందని, అలా నేను చేస్తాను నేను చేస్తాను అంటే ఏ సమస్యా పరిష్కారం అవ్వదు అని ఆయన అన్నారు. పది మందితో చేద్దాం, పది మందితో కలిసి చేద్దాం, వంద మందితో చేయిద్దాం అనే ఆలోచన ఉండాలని ప్రకాష్ రాజ్ అన్నారు. ఎందుకంటే బాధ్యత అనేది ఎంపీ, ఎమ్మెల్యేది కాదని గెలిపించిన ఓటరుకు కూడా ఉంటుంది కదా అని ఆయన చెప్పారు. ఎలక్షన్స్ అనేది అందరి బాధ్యత అన్న ఆయన, వచ్చిన సంక్షేమ నిధులు ఎలా వాడాలి అనేందుకు ఒక వ్యక్తిని తీసుకుంటాం గానీ, అందరితో చర్చించాకే అది జరగాలని ఆయన అన్నారు. అందుకే పెద్దలందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కారించాలనే నినాదాన్ని తీసుకొచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు.