అఖీరా నందన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా ?

All set for Pawan son Akira Nandan debut
All set for Pawan son Akira Nandan debut
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తరువాత అంతటి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో ఆయనొక్కడే. అందరి స్టార్ల కొడుకుల్లాగే  పవన్ కుమారుడు ‘అఖీరా నందన్’ పై అభిమానుల్లో భారీ హోప్స్ ఉన్నాయి. ఎప్పటికైనా అఖీరా సినిమాల్లోకి వస్తాడనే నిర్ణయం అభిమానుల్లో బలంగా ఉంది. వాళ్ళ ఆలోచనల్ని నిజం చేస్తూ అఖీరా త్వరలో తెరపై కనబడనున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అఖీరా తల్లి రేణు దేశాయ్ సైతం అఖీరా సినిమాల్లోకి రావాలి అనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
 
ప్రజెంట్ సిట్యుయేషన్ చూస్తే అఖీరా సినిమాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అఖీరా కూడ అందుకు తగ్గట్టే శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అఖీరా లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.  మరి నిజంగా అఖీరా డెబ్యూకు రెడీ అవుతున్నాడా, పవన్ త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా అనేది చూడాలి. ఇకపోతే పవన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపులు రాగానే ఈ చిత్రాల షూటింగ్ రీస్టార్ట్ కానుంది.