అభిరామ్ ఎంట్రీకి అంతా సెట్ చేశారు

All set for Daggubati Abhiram entry
All set for Daggubati Abhiram entry
తెలుగు తెరకు మ‌రో కొత్త హీరో ప‌రిచ‌యం కాబోతున్నాడు. ద‌గ్గుబాటి కుటుంబం నుంచి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, రానాలు తెలుగు తెర‌పై రాణిస్తుండ‌గా తాజాగా ద‌గ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, రానా సోద‌రుడు అయిన అభిరామ్ తెలుగు ఇండ‌స్ట్రీలో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించి స‌న్నాహాలు కూడా ప్రారంభ‌మైనట్టు తెలుస్తోంది.  అభిరామ్ ఇదివరకే ‘రాజు మహారాజు’ ఫేమ్ భానుశంకర్ దర్శకత్వంలో అభిరామ్  సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల అది చర్చలు దశలోనే ఆగిపోయింది.  తర్వాత అభిరామ్ మీద పలు వివాదాలు రేగడంతో అతని ఎంట్రీని హోల్డ్ చేసి పెట్టారు సురేష్ బాబు. 
 
ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడటంతో రంగప్రవేశానికి రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేయనున్నారు.  పెద్దగా హడావిడి లేకుండానే సినిమాను లాంచ్ చేశారు.  ఈ చిత్రాన్ని సురేష్ బాబు, తేజ సంయుక్తంగా నిర్మించనున్నారు.  సురేష్ బాబు మొదట్లో రవిబాబు లాంటి దర్శకులను అనుకున్నా చివరకు తేజను ఫైనల్ చేశారు. తేజ గతంలో ‘చిత్రం’ సినిమాతో ఉదయ్ కిరణ్, ‘జయం’ చిత్రంతో నితిన్ లాంటి టాలెంటెడ్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ రెండు సినిమాలు కూడ సూపర్ హిట్టయ్యాయి.  మరి తేజ అభిరామ్ కు కూడ అలాంటి గ్రాండ్ ఎంట్రీనే ఇవ్వగలరేమో చూడాలి.