Alia Bhatt Is Out : ఇది నిజమేనా.? అలియా ఔట్.. రష్మిక ఇన్.!

Alia Bhatt Is Out :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమా కొరటాల శివతో వుండబోతోందని ఎప్పుడో ప్రకటించారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ, ఎన్టీయార్ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. కాగా, ఈ సినిమా కోసం హీరోయిన్‌గా అలియా భట్‌ని తీసుకున్నారన్న సంగతి తెలిసిందే.

అధికారిక ప్రకటన అవునా.? కాదా.? అనే సంగతి పక్కన పెడితే, దాదాపు అలియా, ఎన్టీయార్ కాంబినేషన్‌కి జనం ఫిక్స్ అయిపోయారనడంలో ఎంతమాత్రం డౌట్ లేదు. కానీ సీను రివర్స్ అయ్యింది. ఎందుకో తెలీదు కానీ, అలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని అంటున్నారు.

ఆ ప్లేస్‌లో రష్మిక మండన్నా పేరు పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. అయితే, రష్మిక ఇటు తెలుగు సినిమాలతోనూ, అటు హిందీ, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా వుంది. ఈ తరుణంలో కొత్తగా యాడ్ అయిన ఈ ప్రాజెక్టుకు డేట్స్ అడ్జస్ట్ చేయగలదా.?

ఒకవేళ రష్మిక మిస్ అయితే, పూజా హెగ్దే తప్ప వేరే ఛాన్స్ లేదు. మరి పూజా సంగతి కూడా అంతే. అయితే, అలియా భట్ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైమ్‌లోనూ ఇలాంటి రూమర్సే వచ్చాయ్. అదిగో అలియా హ్యాండిచ్చిందట.. ఇదిగో ఈ ప్రాజెక్టు రిజక్ట్ చేసిందట.. అంటూ వరుస కథనాలు వెల్లడయ్యాయ్.

కానీ, అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసింది. మంచి పేరు కూడా తెచ్చుకుంది. సో, ఈ గాసిప్స్‌లో కూడా నిజమెంతో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.