“అల వైకుంఠపురములో” రేంజ్ లో దళపతి సినిమాకి.!

ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓ సినిమా ఫలితాన్ని అయితే చాలా వరకు ఆ సినిమా పాటలే డిసైడ్ చేసేస్తున్నాయి. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కూడా పాటలతోనే సినిమాని లాగినవి చాలా ఉన్నాయి. అలాగే పాటలతో పాటు సినిమా కూడా భారీ హిట్ అయ్యినవి కొన్ని మాత్రమే ఉన్నాయి.

మరి ఆ తరహా చిత్రాల్లో అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “అల వైకుంఠపురములో” కూడా ఒకటి. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా ఒకో సాంగ్ కూడా ఒకదాన్ని మించి ఒకటి సెన్సేషన్ అయ్యాయి.

మరి మళ్ళీ ఆ తరహా ఆల్బమ్ ని సంగీత దర్శకుడు థమన్ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి ఇచ్చినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. తమిళ సినీ వర్గాలు అయితే విజయ్ చేస్తున్న ద్వి భాషా చిత్రం “వారసుడు” కి చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడని అంటున్నారు.

డెఫినెట్ గా ఇది “అల వైకుంఠపురములో” రేంజ్ లో ఉంటుంది అని నమ్మకంగా ఉన్నారట. మరి థమన్ అయితే నిజంగానే ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడా లేదా అనేది చూడాలి. అసలే విజయ్ సినిమాల పాటలకి టీజర్ కి ఎన్ని వందల మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ వస్తుందో తెలిసిందే. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే వీటికీ భారీ మిలియన్ వ్యూస్ వచ్చి పడడం గ్యారెంటీ.