లేటెస్ట్ : దళపతి “లియో” నుంచి బిగ్గెస్ట్ అనౌన్సమెంట్.!

తమిళ సినిమా నాట భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో దళపతి విజయ్ క్రేజ్ సెపరేట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. కాగా రీసెంట్ గానే విజయ్ మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో “వారిసు” అనే సినిమా చేసి భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత తన “మాస్టర్” కాంబోలో మళ్ళీ విజయ్ వర్క్ స్టార్ట్ చేసాడు. ఆ సినిమానే “లియో”.

ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఓ రేంజ్ ఫీస్ట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగ రాజు నుంచి వస్తున్న సినిమాగా ఇది కాగా దీనిపై ఊహించని లెవెల్ హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ కాశ్మిర్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా ఇప్పుడు మేకర్స్ అయితే ఓ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని అందించారు.

దీనితో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్లినట్టు అయ్యిందని చెప్పాలి. కాగా ఈ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ రీసెంట్ గా సౌత్ సినిమా దగ్గర సెన్సేషన్ అయ్యిన సంజయ్ దత్ ఈ సినిమాలో జాయిన్ అయ్యినట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు.

దీనితో ఈ మాసివ్ అప్డేట్ ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చింది. దీనిపై మేకర్స్ ఓ సాలిడ్ వీడియో కూడా వదిలారు. మొత్తానికి ఈ ఊహించని అప్డేట్ తో అయితే సోషల్ మీడియా ఇప్పుడు షేక్ అవుతుంది. కాగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా విజయ్ సరసన ఎన్నో ఏళ్ల తర్వాత నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.