దళపతి విజయ్ మరో తెలుగు సినిమా..అసలు డీటెయిల్స్ ఇవే.!

ఇప్పుడు తమిళ హీరోలీ తెలుగు దర్శకులతో తెలుగు హీరోలు తమిళ దర్శకులు మరియు హింది దర్శకులతో కూడా వర్క్ చేయడం అనేది మంచి ట్రెండ్ గా మారింది. అయ్యితే మన తెలుగు దర్శకులు తమిళ హీరోస్ కి మంచి హిట్స్ ఇస్తున్నారు కానీ తమిళ దర్శకులు మాత్రం ఇంకా హిట్ ఇచ్చే పనిలో ఉన్నారు.

ఇక ఈ లిస్ట్ లో అయితే తమిళ భారీ క్రేజ్ ఉన్న విజయ్ ని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించి విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు అందించాడు. దీనితో విజయ్ తర్వాత కూడా మరో తెలుగు దర్శకునికి ఛాన్స్ ఇస్తారని రూమర్స్ వచ్చాయి.

కానీ ఇపుడు అవి ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి. ఐతే ఈ డీటెయిల్స్ లోకి వెళితే ఈ సినిమాని వీరసింహా రెడ్డి, క్రాక్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ అయితే విజయ్ ని ఒప్పించాడట. కాగా విజయ్ కి గోపీచంద్ స్క్రిప్ట్ ని వినిపించగా తాను అయితే ఫైనల్ డెసిషన్ చెప్పనున్నారని తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనున్నారట. ఆల్రెడీ విజయ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేయడం జరిగింది అని కానీ గోపీచంద్ ఫుల్ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసి మరోసారి విజయ్ కి నరేట్ చేసి ఒప్పించేస్తే సరిపోతుంది అని తెలుస్తుంది. దీనితో అయితే విజయ్ మరో తెలుగు బ్యానర్ మరియు తెలుగు దర్శకునితో సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయినట్టే అని చెప్పుకోవాలి.