అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన 7 సినిమాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీకి సీనియర్ ఎన్టీఆర్ ఒక కన్ను అయితే ఏఎన్నార్ మరో కన్ను అని ప్రేక్షకులు భావిస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సూపర్ హీరో ఎవరనే ప్రశ్నకు ఏఎన్నార్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఏఎన్నార్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. అక్కినేని నాగేశ్వరరావు సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.

ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న స్టార్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావుకు గుర్తింపు ఉంది. ఏఎన్నార్ నటించిన సినిమాలు ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలిచి రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. ఏఎన్నార్ నటించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలను ఇతర హీరోల అభిమానులు సైతం అంగీకరిస్తారు. ఏఎన్నార్ నటించిన పలు సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచడం గమనార్హం.

ఏఎన్నార్ నటించిన సినిమాలలో ఒకటైన బాలరాజు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఏఎన్నార్ కు స్టార్ ఇమేజ్ రావడానికి ఈ సినిమా కారణమైంది. ఏఎన్నార్ నటించిన కీలుగుర్రం 1949 సంవత్సరంలో విడుదలై బాలరాజు సినిమాను మించి కలెక్షన్లను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 15 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

1953 సంవత్సరంలో విడుదలైన దేవదాసు సినిమా అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకుంది. 13 కేంద్రాలలో ఈ సినిమా 100 రోజులు ప్రదర్శించబడటం గమనార్హం. ఏఎన్నార్ నటించిన రోజులు మారాయి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఘన విజయంతో ఏఎన్నార్ క్రేజ్ మరింత పెరగడం గమనార్హం. మయాబజార్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఏఎన్నార్ నటించిన దసరా బుల్లోడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫుల్ రన్ లో కోటిన్నర రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. అప్పటివరకు లవకుశ పేరుపై కలెక్షన్ల విషయంలో రికార్డ్ ఉండగా ఈ సినిమా సక్సెస్ తో ఆ రికార్డ్ బ్రేక్ కావడం గమనార్హం. 33 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఏఎన్నార్ నటించిన ప్రేమాభిషేకం సినిమా సాధించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఏఎన్నార్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో ప్లస్ అయిందని చెప్పవచ్చు.