సినిమా వేదికపై చేసిన ఓ వ్యాఖ్య, రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పెద్ద మైనస్ కాబోతోంది. సీనియర్ నటుడు.. దివంగత అక్కినేని నాగేశ్వరరావుని ఉద్దేశించి, ‘తొక్కనేని’ అనేశారు నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవంలో.!
విజయగర్వం నెత్తికెక్కితే ఎలా వుంటుందో నందమూరి బాలకృష్ణని చూస్తే తెలుస్తుంది. మామూలుగానే బాలయ్య ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడేమో ‘కల్లు తాగిన కోతిలా’ బాలయ్య వ్యవహరించాడన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది.
నందమూరి బాలకృష్ణ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ఎమ్మెల్యే కూడా.! హిందూపురం నియోజకవర్గంలో అయితే ‘మన ఎమ్మెల్యేనే.. ఆ ముండమూరి బాలకృష్ణే..’ అంటూ చర్చించుకుంటున్నారట జనం. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అంతే మరి, ‘అక్కినేని’ని ‘తొక్కనేని’ చేస్తే, ‘నందమూరి’ని ‘ముండమూరి’ చేసెయ్యడం పెద్ద విషయం కాదు కదా.! సీనియర్ నటుడు బాలకృష్ణ. మంచీ, చెడ్డా తెలిసి వుండాలి. నోరు జారితే, క్షమించమని అక్కడికక్కడే అడిగి వుండాలి. లేదూ, ‘మా వంశం.. మా బ్లడ్డు.. మా బ్రీడు.. బ్లడీ ఫూల్స్..’ అంటే వ్యవహారం తేడాగా వుంటుంది.
గతంలో ‘కనిపిస్తే కడుపు చేసెయ్యాలి’ అంటూ మహిళలపైకి అభిమానుల్ని ఉసిగొల్పిన ఘనుడు నందమూరి బాలకృష్ణ. ఇలాగే బాలయ్యను వదిలేస్తే కష్టమే సుమీ.!