Akhil: పూరి జగన్నాథ్ తో అఖిల్ అక్కినేని… ఊహించని కాంబో…. సెట్ అయ్యేనా?

Akhil: తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని వారసులుగా నాగార్జున ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోగా ఈయన కుమారులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చారు నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ మాత్రం ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇక అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాల క్రితం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తదుపరి సినిమాలను ప్రకటించలేదు దీంతో అసలు అఖిల్ ఏ సినిమాలు చేస్తున్నారు ఎక్కడుంటున్నారు అనే విషయాల పట్ల అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈయన సినిమాల గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది తాజాగా అఖిల్ తన తదుపరిచిత్రాన్ని మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఈ వార్తలు కాస్త సంచలనంగా మారాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా ఫ్లాప్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నారు. మరోవైపు అఖిల్ కూడా వరుస ఫ్లాప్ లను ఎదుర్కొని ఉన్నారు ఇలాంటి తరుణంలో వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

అఖిల్ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఆయనకు వెంటనే ఒక సూపర్ హిట్ పడాల్సిందే లేకపోతే ఆయన కెరియర్ పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి. మరోవైపు పూరి జగన్నాథ్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవల ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలను చవిచూడటంతో ఈయనతో సినిమాలు చేయటానికి హీరోలు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ఇలాంటి తరుణంలోనే అఖిల్ పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా అంటే అందరూ షాక్ అవుతున్నారు. మరి వీరి సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.