అఖిల్‌, మోనాల్, సోహెల్ క‌థ వేరే ఉందే.. స్ట‌న్నింగ్ ఫొటోల‌తో స‌ర్‌ప్రైజ్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్యక్రమంలో మొత్తం 19మంది కంటెస్టెంట్స్ పాల్గొన‌గా వారిలో మోనాల్‌, అఖిల్‌, సోహెల్, అభిజీత్, అరియానా అంద‌రి దృష్టిని ఎక్కువ‌గా ఆక‌ర్షించారు. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు మోనాల్- అఖిల్‌- సోహెల్ మ‌ధ్య మంచి బాండింగ్ ఉండ‌గా, అరియానా- అవినాష్‌లు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. ఇక అభిజీత్- హారిక‌ల‌ది కూడా అదే తంతు. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక అవినాష్‌- అరియానాలు జంట‌గా అప్పుడ‌ప్పుడు కనిపిస్తుండ‌గా, మోనాల్‌- సోహెల్‌- అఖిల్‌లు మాత్రం త‌ర‌చు సంద‌డి చేస్తున్నారు.

న్యూ ఇయ‌ర్ రోజు మోనాల్, అఖిల్‌, సోహెల్‌లు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ర‌చ్చ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ఇక తాజాగా అఖిల్ త‌న సోష‌ల్ మీడియాలో ప‌లు ఫొటోలు షేర్ చేయ‌గా, ఇందులో అఖిల్, సోహెల్‌లు మోనాల్‌కు రోజ్ పువ్వు ఇస్తూ న‌వ్వుతూ క‌నిపించారు. మ‌రో ఫొటోలో అఖిల్.. మోనాల్‌తో క‌లిసి రొమాంటిక్‌గా కనిపించాడు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

బిగ్ బాస్ పుణ్య‌మా అని మోనాల్, సోహెల్‌, అఖిల్‌లు చాలా బిజీ అయ్యారు. మోనాల్ బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై కూడా హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అల్లుడు అదుర్స్ సినిమా కోసం మోనాల్ వేసిన మాస్ స్టెప్పులు ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక సోహెల్ హీరోగా ప‌లు సినిమాలు చేస్తుండ‌గా, అఖిల్ విల‌న్ పాత్ర‌ల కోసం వెతుకుతున్నాడు. అయితే గోపిచంద్ సీటీమార్‌లో అఖిల్ చిన్న పాత్ర పోషించాడ‌ని కొద్ది రోజుల క్రితం వార్త‌లు రాగా, వాటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.