Home News సోహెల్ చెల్లెలి పెళ్లిలో సంద‌డి చేసిన అఖిల్.. సెల్ఫీ కోసం ఎగబ‌డిన అభిమానులు

సోహెల్ చెల్లెలి పెళ్లిలో సంద‌డి చేసిన అఖిల్.. సెల్ఫీ కోసం ఎగబ‌డిన అభిమానులు

ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 సెన్సేష‌న్ సోహెల్ పేరు తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌క‌ముందు మ‌నోడు ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ గా బ‌య‌ట‌కు వచ్చే స‌రికి సోహెల్‌కు జ‌నాలు నీరాజ‌నాలు ప‌డుతున్నారు. అత‌నిపై తెగ ప్రేమ కురిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ప‌లు ఇంట‌ర్వ్యూలు, ర్యాలీల‌తో బిజీ బిజీగా ఉన్న సోహెల్ రీసెంట్‌గా త‌న చెల్లెలి పెళ్లి జ‌రిపించాడు. అట్టహాసంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌కు త‌న తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్, క్లోజ్ ఫ్రెండ్ అఖిల్‌ని ఆహ్వానించాడు.

Sohel 6 | Telugu Rajyam

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు అఖిల్‌, సోహైల్‌లు గుడ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. ఎన్ని గొడ‌వ‌లు అయిన చివ‌రికి ఇద్ద‌రు క‌లిసిపోయేవారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇది మొయింటైన్ చేస్తున్నారు. అయితే సోహెల్ చెల్లి పెళ్లి వేడుక‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన అఖిల్ అక్క‌డి వారంద‌రిని న‌వ్వుకుంటూ ప‌ల‌క‌రించాడు. అంతేకాదు అడిగిన వారికి లేద‌న‌కుండా సెల్ఫీ ఇచ్చాడు. చివ‌రికి అఖిల్‌, సోహెల్‌, మెహబూబ్ కూడా గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటో నెటిజ‌న్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

అఖిల్ సార్ధ‌క్ ముందుగా పెళ్లికి రాలేన‌ని చెప్పి ఆ త‌ర్వాత సెడ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంతో అంద‌రు షాక్ అయ్యారట‌. సోహెల్ అయితే ఫుల్ ఖుష్ అయ్యాడు. నీ యవ్వ రానన్నవ్.. మళ్లెట్ల వచ్చినవ్‌రా అంటూ ఆట పట్టించాడు . మెహ‌బూబ్, సోహెల్, అఖిల్ మ‌ధ్య ఉన్న బాండింగ్‌ని చూసి అక్క‌డి వారు కూడా తెగ సంతోషించారు. సోహెల్‌కు ప్ర‌స్తుతం ప‌లు సినిమా ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌గా, మెహ‌బూబ్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసిన‌ట్టు ఫినాలే రోజు చెప్పాడు. ఇక అఖిల్ ప‌రిస్థితి ఏంట‌న్న దానిపై క్లారిటీ లేదు. అంద‌రు ఇంట‌ర్వ్యూల‌తో ర‌చ్చ చేస్తున్నా, అఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ ఎక్క‌డ కూడా క‌నిపించిన దాఖ‌లాలు లేవు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

Latest News