నటీనటులు గౌతం కృష్ణ, పూజిత పూన్నాడ
దర్శకుడు గౌతమ్ కృష్ణ
నిర్మాతలు మనోజ్ జె.డి., డా.జె.మణికంఠ
సంగీతం జూడా సంధ్య
థియేటర్స్ కి జనాలు రావడానికి అంతగా ఆశక్తి చూపకపోయినా….చాలా చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్యలో ‘పండుగాడు’, ‘బుజ్జి ఇలా రా’, ‘మాటరాని మౌనమిది’, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ లాంటి చాలా సినిమాలు డైరెక్ట్ గా థియేటర్లోనే రిలీజ్ అయ్యాయి. కానీ ఏవి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. తాజాగా ”ఆకాశ వీధుల్లో’ అనే ఇంటెన్స్ లవ్ స్టోరీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ:
సిద్ధు (గౌతమ్ కృష్ణ) లవ్ లో ఫెయిల్ అయ్యి, డిప్రెషన్ వెళ్లి బాధపడుతూ ఉంటాడు. కానీ ఇవన్నీ అధిగమించి పెద్ద రాక్ స్టార్ అవుతాడు. కానీ మద్యపానం, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిస అవ్వడం వల్ల ధర్మ మ్యూజిక్ ప్రొడక్షన్ వారు తన తో ఉన్న కాంట్రాక్టు ని క్యాన్సల్ చేసుకుంటారు. దీనితో సిద్ధు జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది, సిద్ధు ఈ సమస్యలన్నింటిని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ.
సినిమా ఎలా వుంది:
హీరో లవ్ లో ఫెయిల్ అవ్వడం, డిప్రెషన్‌లో పడిపోవడం, తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టడం వంటి సినిమాలు బోలెడు చూసాం. ఆకాశ వీధుల్లో కూడా ఇదే కోవలోకి వస్తుంది. మొదటి సీన్ నుండి ఈ సినిమా ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ వస్తుంది.
కొన్ని లవ్ సీన్స్ ఏమి కొత్తగా లేకపోయినా…కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆ సీన్స్ తెరపైన చూడడానికి బాగానే ఉంటాయి. ఈ సినిమా హీరో క్యారెక్టర్ జర్నీ, ఆ క్యారెక్టర్ లో కొంతదానం ఏమి లేదు.
గౌతమ్ కృష్ణ హీరో గా, డైరెక్టర్ గా ఈ సినిమాకు పనిచేసాడు. యాక్టర్ గా పర్లేదు కానీ, డైరెక్టర్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు.
ఓవరాల్ గా, ‘ఆకాశ వీధుల్లో’ సినిమా చాలా రొటీన్ సినిమా. ఇలాంటి సినిమాలు తెలుగులో, హిందీలో గతం లో చాలానే వచ్చాయి. మీకు చూడటానికి లేకపోతే ఒకసారి ఈ సినిమాను ట్రై చెయ్యొచ్చు.