కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వలిమై” నుంచి ఇటీవల వచ్చిన గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
దర్శకుడు హెచ్ వినోత్ తో ఇది తనకి డైరెక్ట్ గా మొదటి సినిమా అయినా వినోత్ మాత్రం అజిత్ స్టార్డంను ఎక్కడా తగ్గించకుండా తీసుకున్న టేకింగ్ ఇంప్రెసివ్ గా ఉంది.
అయితే అజిత్ కానీ కోలీవుడ్ లో ఇతర స్టార్ హీరోలు కానీ వర్క్ నచ్చితే అదే దర్శకునితో వరుస సినిమాలు చేస్తారు. అలానే అజిత్ మరియు వినోత్ ల కాంబో రిపీట్ అవుతుంది అని ఎప్పుడు నుంచో టాక్ ఉంది.
కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే వీరితో పాటు ఇప్పుడు వలిమై నిర్మాత బోనీ కపూర్ కూడా చేతులు కలపనున్నారట. దీనితో ఈ సెన్సేషనల్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం కన్ఫర్మ్ అని చెప్పాలి.
ఇప్పటికే బడ్జెట్ పరంగా అయితే బోనీ ఎక్కడా తగ్గినట్టు వలిమై విషయంలో అనిపించలేదు. ఇక వీరి నుంచి రెండో సినిమాని ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారో చూడాలి.