అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎయిరిండియా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని సంస్థ ప్రకటించింది. ఇది టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించిన కోటి రూపాయల పరిహారానికి అదనంగా చెల్లించనున్న మొత్తమని తెలిపింది.
తీవ్ర గాయాలైన వారికి వైద్య ఖర్చులన్నింటినీ ఎయిరిండియానే భరించనున్నట్టు సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందిస్తూ, “ఈ ప్రమాదం తమ మనసులను బాగా కలిచేసిందని… వర్ణించలేనంత బాధలో ఉన్న బాధిత కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తునట్లు తెలిపింది.
ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలవబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాక, ఇప్పటికే అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ నిర్మాణానికి తమవంతు సహాయం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ ఘటనపై విమానయాన రంగం మొత్తం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. బాధితులకు ఈ ఆర్థిక సాయం ఊరటనిచ్చే ప్రయత్నం మాత్రమే అయినా, సంస్థలు చూపిస్తున్న జవాబుదారీదృక్పథం ప్రశంసనీయం.