Aha OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ లో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాల ఎంపిక విషయంలో ఆ సినిమాని ఏ బడ్జెట్లో నిర్మించాలి ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అని ఎంతో నైపుణ్యం కలవారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే అల్లుఅరవింద్ కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా మొట్టమొదటిసారి తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ “అహా” ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఓటీటీ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు,టాక్ షో లను ప్రసారం చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇలా తెలుగులో ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న “ఆహా” ఇకపై ఆహా 2.0′ ఓటీటీ వెర్షన్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అహాను తమిళంలో కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా ద్వారా తమిళంలో ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ తో ప్రమోషన్ చేయించి ఆహాకు మరింత క్రేజ్ వచ్చేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు బేస్ తో ప్రారంభమైన ఓటీటీ ఆహా ఇతర భాషలలో చిత్రాలను డబ్ చేసి ప్రసారం చేస్తోంది. ఇలా
ఈ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఆహా ఇకపై తమిళ ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనునట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ వ్యాఖ్యాతగా అహాలో ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రతి ఒక్కరి చేత ఆహా అనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహాకి ఎంతోమంది సబ్స్క్రైబర్లు పెరిగినట్లు తెలుస్తోంది.