రాజకీయ నాయకుల భద్రత కోసం ఏపీలో ఇప్పటికే అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. మొన్ననే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన భద్రతను కలిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మరో వైసీపీ మంత్రికి అధికారులు ప్రత్యేక భద్రత కలిపిస్తున్నారు. ఇంటిలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు భద్రతకు ముప్పుందని హెచ్చరించింది. దీంతో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిచాలని ప్రభుత్వానికి సూచించింది. దీనితో హోం శాఖ ఏపీ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూవ్ వాహనాన్ని కేటాయించింది.
వారం క్రితం మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూవ్ వాహనం కేటాయించాలని ఇంటలిజెన్స్ వర్గాలు హోంశాఖకు సూచించినట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబుకు ఇంటలిజెన్స్ వర్గాల సూచించాయి.
2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కన్నబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. వైసీపీలో ఉన్న ముఖ్యనాయకుల్లో కన్నబాబు ఒకరు. అయితే కన్నబాబుకు ఎవరి నుండి ముప్పు ఉందనే అనే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతల నుండి తనకు ముప్పుందని ఢిల్లీ హై కోర్ట్ లో పిటిషన్ వేయగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కలిపించింది విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కన్నబాబుకు ఏకంగా బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడంతో మంత్రికి ఏ స్థాయిలో ముప్పుందో అర్ధం చేసుకోవచ్చు. వ్యవసాయశాఖతో పాటు విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ గా భాద్యతలు స్వీకరిస్తున్నారు. దీంతో విశాఖ పర్యటనలో ఆయన్ను మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేయనున్నారు.