Age Bar Heroines : ప్రేమించి పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లకు అభిప్రాయ బేధాలతో విడిపోవాలనుకోవడం, అధికారికంగా విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకోవడం ఇదంతా ఇప్పుడు సెలబ్రిటీస్‌లో ట్రెండ్‌గా మారింది.
ఓకే, అభిప్రాయ బేధాలొచ్చినప్పుడు విడిపోవాలి తప్పేం లేదు. కానీ, అభిప్రాయ బేధాలు ఎందుకొస్తాయ్.? అది వేరే చర్చ. వయసు తేడా వల్లనో, వృత్తిపరమైన తేడాల వల్లనో.. లేక మరోటో.. కారణాలు అనేకం కావచ్చులెండి. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటారా.? అక్కడికే వచ్చేద్దాం.
భార్యా భర్తలైనా, లవర్స్ అయినా సరే, ఏజ్ గ్యాప్ అనేది గమనించాల్సిన అతి ముఖ్య విషయమే. ఎక్కువ ఏజ్ గ్యాప్ వుంటే, సహజంగానే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు నేటి యువత. కానీ, కొందరు సెలబ్రిటీలు మాత్రం మా ప్రేమకీ, పెళ్లికీ వయసుతో అస్సలు సంబంధం లేదంటున్నారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తన కన్నా వయసులో చాలా చిన్నవాడైన కుర్రోడితో ప్రేమలో పడి, చక్కగా పెళ్లి చేసేసుకుంది. హాయిగా సంసారం చేసుకుంటోంది. మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ సుస్మితాసేన్ కూడా తన కన్నా వయసులో చాలా చిన్నవాడైన యువకునితోనే లవ్ ట్రాక్ నడిపిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.
బాలీవుడ్ హాట్ ఐటెమ్ అండ్ ఆంటీ మలైకా అరోరా విషయానికి వస్తే, యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమ యవ్వారం నడిపిస్తోంది. ప్రేమ, పెళ్లి సంగతి సరే, కానీ, తమ తమ రిలేషన్‌షిప్స్‌లో ఇంత ఏజ్ గ్యాప్ వున్న ఈ సెలబ్రిటీలు ఎటువంటి అభిప్రాయ బేధాలకీ తావివ్వకుండా అలా ఎలా తమ రిలేషన్‌షిప్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారా.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.