Katrina Kaif: బాలీవుడ్ ప్రేమపక్షులుగా ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉంటూ ప్రేమ విషయం బయట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చివరికి డిసెంబర్ 9 వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలు ఎక్కినా కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా వీరి పెళ్లి ప్రచారం మొదలైనప్పటి నుంచి పెళ్ళి తరువాత కూడా వీరికి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లయిన తర్వాత కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన కత్రినాకైఫ్ కోడలిగా ఎంతో ఒద్దికగా ఉండడం చూసి ఎంతో మంది నెటిజన్లు ఈమెపై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే కత్రినా కైఫ్ వివాహం తర్వాత విక్కీ కౌశల్ తో కలిసి ముంబై జుహులోని సీ ఫేసింగ్ ఇంటికి షిప్ట్ అయ్యారు. ఇక తాజాగా కత్రినా కైఫ్ ఈ ఇంటిలో ఒక సోఫాలో కూర్చొని బెగీ జిప్‌తో ఉన్న గోధుమ రంగు స్వెటర్, స్మాల్ షార్ట్ ధరించి , డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన మంగళసూత్రాన్ని మెడలో వేసుకొని అది కనిపించేటట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు స్పందిస్తూ వివాహం తర్వాత మెడలో మంగళసూత్రం వేసుకొని కత్రినాకైఫ్ ఎంతో చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.