చిరు కోలుకున్నాడు..బాలయ్యకి సర్జరీ పడింది.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన ‘గాడ్ ఫాథర్’ సినిమా శరవేగంగా కంప్లీట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దీని కన్నా ముందు “ఆచార్య” అనే బిగ్ బడ్జెట్ చిత్రాన్ని చిరు కంప్లీట్ చేసేసారు. అయితే ఇదిలా ఉండగా చిరు ఓ కట్టు తో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దానితో ఓ చిన్న సర్జరీ మెగాస్టార్ కి అయ్యి అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే విశ్రాంతి తీసుకొని రెండు రోజులు కితమే కోలుకున్నారు.

మరి ఇప్పుడు చిరు ఇలా కోలుకోగా చిరు సహా బిగ్ స్టార్ హీరో నటసింహం బాలయ్య కూడా చిరు తరహా సమస్యే ఎదురైనట్టు తెలుస్తోంది. బాలయ్య చేతికి కూడా ఇప్పుడు ఒక కీలక సర్జరీ కంప్లీట్ అయ్యినట్టు ఇప్పుడు తెలుస్తోంది. బాలయ్య చేతికి దాదాపు నాలుగు గంటల పాటు వైద్యులు శ్రమించి ఈ చికిత్స పూర్తి చేసారట. అయితే ఇందులో పెద్ద ప్రమాదం లేదని కొన్ని రోజుల్లో బాలయ్య కొలుకుంటారని తెలుస్తోంది. ఇక దీని తర్వాత బాలయ్య దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఓ మాస్ ప్రాజెక్ట్ అలాగే ఆహా షో లో జాయిన్ కానున్నారు.