వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజల పూర్తి మద్దతుతో విజయం సాధించి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ సీఎం జగన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కోర్ట్ ల చుట్టూ తిరగడం వల్ల దేశ స్థాయిలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇప్పుడు స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీం కోర్ట్ నుండి ఎదురైన అవమానాన్ని జగన్ తన జీవితంలో ఎప్పటికి మర్చిపోలేరు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేస్తున్న నాటకాలను చూస్తున్న జగన్ వాళ్లకు స్థానిక ఎన్నికల తరువాత స్పాట్ ఫిక్స్ చేశాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అవమానాలను జగన్ మర్చిపోలేదా!!
ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తనకు ప్రభుత్వ సంస్థల నుండే ఇబ్బందులు రావడాన్ని జగన్ భరించలేకపోతున్నారు. దాదాపు కోర్ట్ ల నుండి 100పైగా సార్లు ఎదురుదెబ్బలు తిన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇంతలా ఇబ్బందులకు గురి చేయడాన్ని జగన్ భరించలేకపోతున్నారు. ముఖ్యంగా జగన్ స్థానిక ఎన్నికల నేపధ్యంలో దేశ జరిగిన అవమానాన్ని కూడా జగన్ రెడ్డి మర్చిపోలేకపోతున్నారు. ఇవ్వని గుర్తుపెట్టుకున్న స్థానిక ఎన్నికల తరువాత టీడీపీ నాయకులకు చుక్కలు చూపించనున్నారని సమాచారం.
టీడీపీ నాయకులకు ఇబ్బందులు తప్పవా!!
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ నేతలను జగన్ టార్గెట్ చేయనున్నారు. ఇప్పటికే కొందరు నేతలు భూ వివాదాల్లోనూ, వ్యాపార లొసుగులతోనూ ఉన్నారు. వారందరికీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చుక్కలు చూపించాలన్నది జగన్ భావనగా ఉంది. ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ వంటి టీడీపీ నేతల వ్యాపారాలపై వరస దాడులు నిర్వహించారు. మరికొందరు వ్యాపారాలను నిలిపివేసుకున్నారు. ఇలా కాకుండా విశాఖ సిట్ రిపోర్ట్ అందిన వెంటనే చర్యలు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇందులో టీడీపీ ముఖ్యమైన నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. సిట్ నివేదిక మరో మూడు నెలల్లో ప్రభుత్వానికి అందనుంది. ఇందులో పేర్లు ఉన్న వాళ్ళను జగన్ ఒక ఆట అడుకొనున్నారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.