“కేజీఎఫ్ 2” తర్వాత “కాంతారా” అరుదైన సెన్సేషనల్ రికార్డు.!

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపిన సినిమాలు చాలా ఎక్కువే వచ్చాయి అని చెప్పాలి. ముఖ్యంగా మన సౌత్ సినిమా నుంచి అయితే తెలుగు సహా కన్నడ భాషల నుంచి పలు చిత్రాలు నార్త్ మార్కెట్ లో వండర్స్ నమోదు చేసాయి.

మరి లాంగ్ రన్ పరంగా చాలా మంచి సినిమాలు ఈ ఏడాది లోనే నమోదు కాగా ఈ చిత్రాల్లో అయితే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా తానే దర్శకత్వం వహించిన భారీ బాల బస్టర్ హిట్ చిత్రం “కాంతారా” కూడా ఒకటి. మరి ఈ చిత్రం కేవలం కన్నడ లోనే మొదట రిలీజ్ అయ్యి పలు భాషల్లో హాట్ టాపిక్ గా మారగా..

నెక్స్ట్ అయితే ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కన్నడ భాషలో ఓ అరుదైన రికార్డు నెలకొల్పినట్టు తెలుస్తుంది. అక్కడ ఈ ఏడాది కేజీఎఫ్ 2 తర్వాత ఒక్క భాష కేవలం కన్నడ లోనే 1 కోటి టికెట్లు తెగిన చిత్రంగా..

కాంతారా సెన్సేషనల్ రికార్డు నమోదు చేసినట్టుగా ఇప్పుడు కన్నడ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. ఇక దీని బట్టి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి విక్రాంత్ రోనా ఫేమ్ సంగీత దర్శకుడు అజనీష్ వర్క్ చేయగా కేజీఎఫ్ మేకర్స్ నిర్మాణం వహించారు.