“కేజీఎఫ్ 2” తర్వాత యష్ సినిమా ఏంటి? వైరల్ అవుతున్న కీలక డీటెయిల్స్.!

Yash

Yash Project : శాండిల్ వుడ్ నుంచి హీరోగా వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ స్టార్డం ని తెచ్చుకున్న హీరో యష్. తన లాస్ట్ రెండు సినిమాలు కేజీఎఫ్ 1 అలాగే కేజీఎఫ్ 2 లతో భారీ వసూళ్లతో పాటు భారీ స్థాయి క్రేజ్ ని తన సొంతం చేసుకున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా ఎంతో పెద్ద హిట్లు పైగా అసలు యష్ ని రాకీ భాయ్ గా తప్ప మరే ఇతర పాత్రల్లో చూసేలా ఆడియెన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేవి చాలా ఆసక్తిగా ఉన్న ప్రశ్నలు. దీనితో యష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది చాలా కీలకంగా మారింది.

అయితే మధ్యలో కేజీఎఫ్ 3 నే ఉంటుంది అని టాక్ కన్ఫర్మ్ అయ్యింది కానీ తర్వాత మేకర్స్ దాన్ని ఖండించారు. దీనితో యష్ తర్వాత సినిమాపై మరింత ఆసక్తి అందరిలో నెలకొంది. మరి దీనిపై ఇప్పుడు కొన్ని అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి.

కన్నడ మీడియా వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే యష్ తర్వాతి సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఆడుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 – 50 రోజుల వేడుకకి చేరుకున్న రోజున అనౌన్స్ కాబోతుందట.

ఆరోజే యష్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు నిర్మాణం వహిస్తారు? యష్ కొత్త లుక్ కూడా రివీల్ అవుతుంది అని అంటున్నారు. అయితే వీటిలో ఎంత నిజం ఉందో ఇంకా ఎవరికీ తెలీదు. అది తెలియాలి ఈ జూన్ మొదటి వారం వరకు ఆగాల్సిందే.