ప్రకాష్ రాజ్ ఇలా ఫిక్స్ అయ్యిఉంటే అనుకున్నదే జరిగేది!

After His Defeat Prakash Raj Taken Sensational Decision Over Maa Results | Telugu Rajyam

గత కొన్ని రోజులు కితమే ఎన్నో అంచనాలు నడుమ ఆసక్తి నడుమ జరిగిన “మా” ఎలక్షన్ లు దాని ఫలితాలు ఎలాంటి దుమారం రేపాయో చూసాము.. జస్ట్ 900 ఓట్లు మాత్రమే అయినా దీని ఎఫెక్ట్ ప్రతి ఒక్కరికీ ప్రిస్టేజియస్ గా మారింది. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గా ఎట్టి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ బావుటా ఎగురవేస్తారు అనుకుంటే దానిపై మంచు విష్ణు నీళ్లు జల్లాడు. దీనితో మన గ్రామాల్లో జరిగే లోకల్ పాలీటిక్స్ కన్నా దారుణంగా ఎన్నికలు జరిగాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కానీ మంచు విష్ణు గెలుపుకి ప్రకాష్ రాజ్ మరో రకంగా చెక్ పెట్టే ఆలోచన చేసారని సినీ వర్గాల్లో ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఉన్న “మా” కి పోటీగా ఏకంగా “ఆత్మా” అనే ఒకదాన్ని పెట్టాలని ప్రకాష్ రాజ్ అనుకుంటున్నారని దానికి ఆత్మా అంటే (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అని కూడా పేరు కూడా ఫిక్స్ చేసారని టాక్ వచ్చింది.

దీనితో ఈ ట్విస్ట్ మోషన్ బాబు అండ్ ఫ్యామిలీ ఊహించనిది అయినా దీనిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఒకవేళ నిజం కానీ అయితే మొదటి నుంచి కూడా నిపుణులు చెప్తున్నా మాట నిజం అయ్యేది అని చెప్పాలి.. ఈ ఎన్నికలు ఎందుకో తెలుగు సినిమా రెండు ముక్కలు అయ్యేలా దారి తీసేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ ఇలాంటివి లేవని చెప్పడంతో టాలీవుడ్ రెండు ముక్కలు అవ్వడం అనేది జరగదని చెప్పొచ్చు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles