Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సబా అజాద్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ కూడా తన ప్రేయసితో కలసి ముంబై వీధుల్లో విహరిస్తూ కెమెరాల కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు,అలాగే ఫోటోలను బట్టి చూస్తే ఆ వార్తలు నిజమే నంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఇటీవలే ఫర్హాన్ అక్తర్ తన ప్రేయసి శివాని దండేకర్ ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వివాహానికి హృతిక్ రోషన్ కూడా హాజరయ్యాడు. దీనితో ఫర్హాన్ తరహాలోనే హృతిక్ రోషన్ కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నట్లు, అదేవిధంగా జీవితంలో తనకు తోడు అవసరమని భావించిన హృతిక్ రోషన్ త్వరలోనే ప్రేయసి సబా ను తన లైఫ్ పార్టనర్ ఎలా చేసుకోవాలని అయినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.