Shivaji: జగన్ పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు…11 కాదు సింగిల్ డిజిట్ రావాలి అంటూ!

Shivaji: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఇటీవల కాలంలో రాజకీయాలలో ఎంతో యాక్టివ్ అవుతున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీలు కొన్ని పార్టీలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే నటుడు శివాజీ కూడా బహిరంగంగానే తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. అయితే గతంలో ఈయన ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాలలో సంచలనం సృష్టించారు.

ఇలా సినిమాలకు దూరమే రాజకీయాలు గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక గత కొంత కాలం పాటు సినిమాలకు రాజకీయాలకు కూడా దూరంగా ఉన్న ఈయన తిరిగి సినీ ఇండస్ట్రీపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ప్రస్తుతం పలు సినిమాలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల కోర్టు సినిమాలో విలన్ పాత్రలో నటించి మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు.

ఇలా శివాజీ తెలుగు సినిమాలలో బిజీ అవుతున్నారన్న తరుణంలో ఈయన మరోసారి రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలందరూ కూడా 11 అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు.. ఇప్పటికే ఎంతోమంది 11 అంటూ వైసీపీ పార్టీకి ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నారు.

తాజాగా నటుడు శివాజీ సైతం ఇదే విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వాళ్లకి ఆ 11 కూడా రాకుండా ఉండాల్సింది అని నెక్స్ట్ అవి కూడా రావు సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితం అయ్యిపోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.తాను సహా తన ఎన్నారై ఫ్రెండ్స్ జగన్ కి ఆ 11 కూడా రావని అనుకున్నామని ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యిపోవాలని తాను కోరుకుంటున్నట్టుగా శివాజీ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.