సుమ గురించి మాట్లాడుతూ స్టేజి మీదే ఆమె పరువు తీసిన అడివి శేష్..!

రన్ రాజా రన్, బాహుబలి, క్షణం వంటి సినిమాలలో నటించిన అడివి శేష్ తన నటనతో నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అడివి శేష్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరిగింది.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర మహారాణిగా ఒక వెలుగు వెలుగుతున్న సుమ తన మాటలతో అందరినీ మాయ చేసి తన అభిమానులుగా మార్చుకుంటోంది. స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్ కి ఫిదా అవుతూ ఆమె అభిమానులు గా మారుతున్నారు.

YouTube video player

ఇన్ని సంవ్సరాలుగా ఇండస్ట్రీలో తన యాంకరింగ్ తో సందడి చేస్తున్న సుమని అందరు సుమక్క అని పిలవాల్సిందే. పొరపాటున కూడా ఆంటీ అని పిలిస్తే తను అస్సలు ఒప్పుకోదు. కానీ ఇటీవల మేజర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా యూనిట్ క్యాష్ షో లో సందడి చేసింది. ఈ షోలో అడవి శేషు సుమ గారి గురించి మాట్లాడుతూ.. అందరి లాగే సుమ అంటే తనకి కూడా క్రష్ ఉందని చెప్పుకొచ్చాడు. నా చిన్నప్పటి నుండి సుమ గారిని టీవిలో చూస్తూన్న అంటూ ఆమె వయసు గురించి మాట్లాడుతు క్యాష్ షో లో ఆమె పరువు తీశాడు.