Dacoit Fire Theme: అడివి శేష్ డకాయిట్ మూవీ నుంచి ఫైర్ థీమ్ రిలీజ్.. మామూలుగా లేదుగా!

Dacoit Fire Theme: టాలీవుడ్ హీరో అడివి శేష్‌ గురించి మనందరికీ తెలిసిందే. అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల కాలంలో అడివి శేష్‌ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇకపోతే అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డకాయిట్. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.

అడివి శేష్‌ నటించిన క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్‌ గా చేసిన షానీల్‌ డియో ఈ మూవీతో డైరెక్టర్‌ గా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇందులో అడివి శేష్ సరసన హీరోయిన్‌ గా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్‌ గ్లింప్స్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫైర్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇకపోతే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి ఫైర్ థీమ్(ఒరిజినల్ ‍సౌండ్‌ ట్రాక్‌) విడుదల చేశారు. ఈ ఫైర్‌ థీమ్‌ ను భీమ్స్ సిసిరోలియో పవర్‌ ఫుల్‌ గా కంపోజ్‌ చేశారు.

ఇది ప్రేక్షకులకు ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాలి. అలాగే ఇది అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్‌ లో టాప్‌ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ క్రిస్‌మస్‌ కానుకాగ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కి కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోంది. ఈ ఫైర్ థిమ్ ను చూసిన అభిమానులు సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో హీరో అడివి శేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారు చూడాలి మరి.