అనసూయ పై అదిరే అభి ఇంట్రస్టింగ్ కామెంట్స్.. నీ జీవితం ఎవరో పెట్టిన బిక్ష కాదు..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు. అలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో అదిరే అభి కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన అభి సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన జబర్దస్త్ నుండి అభి కొంతకాలం క్రితం బయటికి వెళ్ళాడు. రెమ్యూనరేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న అభి జబర్దస్త్ షో కి స్వస్తి చెప్పాడు.

ప్రస్తుతం అభి మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేస్తున్నాడు. ఇలా టీవీ షోస్ తో పాటు సినిమాలలో కూడా నటిస్తూ అభి ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇటీవల ఒక టీవీ షో లో అభి జబర్ధస్త్ యాంకర్ అనసూయ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అనసూయ తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట న్యూస్ రీడర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ ఇప్పుడు యాంకర్ గా, నటిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.

ఇదిలా ఉండగా అభి ఇటీవల అనసూయ గురించి మాట్లాడుతూ..అను నేను నిన్ను కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నా. న్యూస్ రీడర్ గా చేశావు, యాంకర్ గా చేశావు. ఇప్పుడు నటిగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో నటిస్తున్నావు. నీ ఎదుగుదల నీకు ఎవరో పెట్టిన బిక్ష కాదు… నువ్వు కష్టపడి సాధించుకున్నది. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఇంకా మంచిగుర్తింపు తెచ్చుకోవాలి అంటూ.. అనసూయ మీద అభి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అనసూయ కూడా జబర్ధస్త్ కి దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.