Vaani Kapoor: బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, బ్యూటీఫుల్ హీరోయిన్ వాణీ కపూర్ నటించిన తాజా చిత్రం ‘చంఢిగర్ కరే ఆషికీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే నటి వాణి కపూర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ సినిమాలో నా పాత్ర చేయడానికి చాలా కష్టపడ్డానని మొదట్లో ఈ పాత్రలో చేయాలంటే భయం వేసిందని తెలియజేశారు.
ఈ పాత్రలో నటించడం కోసం నేను చాలా మంది వ్యక్తులతో, ట్రాన్స్ గర్ల్స్‌తో మాట్లాడాను. అదేవిధంగా 1990 నుంచి 2000లో వచ్చిన ఎన్నో డాక్యుమెంటరీలు, షోస్, సినిమాలు చూశానని, అదేవిధంగా ‘ఈ పాత్రలో నన్ను ట్రాన్స్ కమ్యూనిటీ అంగీకరించరేమో అని. భయపడ్డాను. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత తన పాత్రని చూసి ఎంతో మంది ట్రాన్స్ కమ్యూనిటీ రంగం నుంచి తనకు ఫోన్లు చేస్తూ తనకి ప్రశంసలు కురిపిస్తున్నారనీ వాణికపూర్ వెల్లడించారు.
ఈ సినిమా కథతో వచ్చిన సిమ్రాన్ సాహ్నిని కలిశాను అలాగే వారిద్దరి ట్రాన్స్ గర్ల్స్ అయిన కూతుర్లతో కలిసి ఈ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్ళమని ఈ సినిమా చూసిన వారు కూడా ఎంతో సంతోషపడ్డారని ఈ సందర్భంగా వాణికపూర్ తెలిపారు అలాగే వారి తండ్రి కూడా ఈ సినిమాను చూస్తూ తన ప్రశంసలు కురిపించడం తనకు మర్చిపోలేని అనుభవం అని ఈ సందర్భంగా వాణి కపూర్ వెల్లడించారు.